- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పీడో మీటర్లకు అమ్మ నాన్న స్టిక్కర్లను అంటించండి : మంత్రి వాకిటి శ్రీహరి
బైక్ లు నడిపేటప్పుడు స్పీడో మీటర్ లకు అమ్మా, నాన్న అని ఉండే విధంగా స్టికర్లను అంటించాలని రవాణా అధికారులకు సూచించారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : బైక్ లు నడిపేటప్పుడు స్పీడో మీటర్ లకు అమ్మా, నాన్న అని ఉండే విధంగా స్టికర్లను అంటించాలని రవాణా అధికారులకు సూచించారు. నారాయణపేట జిల్లా కేంద్రం లో గురువారం జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో పాల్గొన్నారు రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గోని విద్యార్థులచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.బైక్ లు నడిపేటప్పుడు స్పీడో మీటర్ లకు అమ్మా, నాన్న అని ఉండే విధంగా స్టికర్లను అంటించాలని రవాణా అధికారులకు సూచించారు. లక్ష స్టికర్లకు తానే స్వయంగా డబ్బులు ఇస్తానని, వాటిని ప్రింట్ చేయించి ప్రతీ బైక్ కు అంటించాలని అధికారులను ఆదేశించారు. యువకులు బైక్ లపై స్టంట్లు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కోట శ్రీనివాసరావు,బాబు మోహన్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,అజహరుద్దీన్ వంటి ప్రముఖుల కుమారులు కూడా రోడ్డు ఆక్సిడెంట్ లో మృత్యువాత పడ్డారని మంత్రి గుర్తు చేశారు. మన దేశం లో ప్రతీ సెకండ్ కు ఒక ఆక్సిడెంట్ జరుగుతుందని, భద్రతా నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాల నుండి తప్పించుకోగల్గుతామని తెలిపారు. పేరెంట్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలను, యువకులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆక్సిడెంట్ వల్ల తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ను దేశ జట్టులో ఆడే అవకాశం కోల్పోయానని మంత్రి తన స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. మనం భద్రతా నియమాలు పాటించినా ఎదుటి వారు సేఫ్టీ గా రాకపోతే ఇరువురికి ప్రమాదమని తెలిపారు. మన శరీరం లో ప్రతీ అవయవం ముఖ్యమని అందుకే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి సేఫ్టీ నియమాలు పాటించా లన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పార్టీ నాయకులు రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.






