ఇంట‌ర్ లో ప్ర‌వేశాల‌కు అడ్మిష‌న్ కౌన్సెలింగ్

by Ratna Kumari |

ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు మన్ననూర్ గిరిజన గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ పద్మావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంట‌ర్ లో ప్ర‌వేశాల‌కు అడ్మిష‌న్ కౌన్సెలింగ్
X

దిశ‌, అచ్చంపేట : ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు మన్ననూర్ గిరిజన గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ పద్మావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు "ఆల్ మదీనా బీఈడీ కళాశాల రాయచూర్ రోడ్డు " మహబూబ్ న‌గ‌ర్ లోని గిరిజన గురుకుల బాలికల విద్యాలయo లో ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ, ఎంపీసీ, హెచ్ఈసి, సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ (ఎంఎల్ టి), (ఏటి & టి) గ్రూపులలో ఆయా కళాశాలలో చేరుటకు పై కళాశాలలో నేరుగా అడ్మిషన్ కౌన్సిలింగ్ ను మహబూబ్ న‌గ‌ర్ రీజినల్ కోఆర్డినేటర్ పి.ఎస్. కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారన్నారు. అర్హత, ఆసక్తిగల బాలురు ఈనెల 16, బాలికలు 18 న తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాఫీలతో కౌన్సిలింగ్ సెంటర్ కు హాజరు కావాల‌ని సూచించారు.

Next Story