- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఉగ్రవాదుల చర్యలు హేయమైనవి : సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు
ఉగ్రవాదుల చర్యలు హేయమైనవి : సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు
by Ratna Kumari |
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దేశంలో ఉగ్రవాదులు రోజురోజుకు పెచ్చురిల్లుతున్నారని, వారి చర్యలు అత్యంత హేయమైనవని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దేశంలో ఉగ్రవాదులు రోజురోజుకు పెచ్చురిల్లుతున్నారని, వారి చర్యలు అత్యంత హేయమైనవని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. ఢిల్లీ పేలుళ్ళ సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ, ఉగ్రవాదుల చర్యలు ఖండిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని, కాల్పులకు, పేలుళ్లకు పాల్పడుతూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించడం క్షమించరానిదని, వాటిని వ్యతిరేకిస్తూ, ప్రతిఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, కోటిరెడ్డి, రాములు, బాలకృష్ణ, గంగాధర్, హేమంత్ కుమార్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Next Story






