కార్యకర్త పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే

by Ratna Kumari |

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మంద విజేందర్ రెడ్డి

కార్యకర్త పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మంద విజేందర్ రెడ్డి గురువారం అనారోగ్యంతో మరణించగా శుక్రవారం పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. విజేందర్ రెడ్డి పార్థివ దేహాన్ని చూసి మర్రి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ తాను చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడని, బీఆర్ఎస్ పార్టీ మంచి నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Next Story