శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు : డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్

by Ratna Kumari |

ప్రజల ప్రశాంతతకు ఎవ్వరైనా విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు :  డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్
X
దిశ, పెద్దకొత్తపల్లి : ప్రజల ప్రశాంతతకు ఎవ్వరైనా విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని అన్నీ రకాల రికార్డులను ఆయన పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని, ఆ హక్కుకు ఎవ్వరూ కూడా భంగం కలిగించరాదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవ్వరిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ హెచ్చరించారు. గ్రామాల్లోకి ఎవ్వరైనా అనుమానితులు వేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎవ్వరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు రావచ్చని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈయన వెంట సీఐ శంకర్ నాయక్, పెద్దకొత్తపల్లి ఎస్సై వి సతీష్ ఉన్నారు.
Next Story