డిజిటల్ పేమెంట్ లో లంచాలు తీసుకున్న ఉద్యోగుల పై చర్యలు

by Ratna Kumari |

తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో లంచాలు తీసుకుంటున్న ఇంజనీర్లు మరియు ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.

డిజిటల్ పేమెంట్ లో లంచాలు తీసుకున్న ఉద్యోగుల పై చర్యలు
X

దిశ, జోగులాంబ ప్రతినిధి : తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో లంచాలు తీసుకుంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విజిలెన్స్ విచారణలో ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా లంచాలు స్వీకరిస్తున్నట్లు బయటపడటంతో మొత్తం 8 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ఏ డి ఈ ), అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏ ఈ ) మరియు సబ్ ఇంజనీర్లపై గురువారం సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన లోతైన విచారణలో వివిధ అంశాల్లో ఈ అధికారులు డిజిటల్ మార్గాల ద్వారా లంచాలు తీసుకున్నట్లు తేలింది. సాధారణంగా నగదు రూపంలో జరిగే అవినీతి ఇప్పుడు యుపీఐ, ఫోన్ పే వంటి ఆధునిక సాంకేతికతలకు మారడం గమనార్హం. ఈ కేసులు ప్రధానంగా గద్వాల్ సర్కిల్‌లో బయటపడ్డాయి. ఇక్కడ విద్యుత్ సర్వీసులు, కనెక్షన్లు మరియు మరమ్మత్తు పనుల్లో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది.

చిన్న సుబ్బా రాయుడు.. గద్వాల్ సర్కిల్‌లో విద్యుత్ సర్వీసు సంబంధిత పనులకు రూ.25,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.. కేసు నంబర్: ఎల్ ఆర్ .నెంబర్ .144/అంటి -బ్రైబ్ /సీవి వో /టీజీఎస్పీడీసీఎల్ /2025 (రెఫరెన్స్: 232-సి 2/2025) ఎల్ ఆర్ .No.161/ఆంటీ -బ్రైబ్ - /సీవీ వో /టీజీఎస్పీడీసీఏల్ /2025, తేదీ : 20.01.2026.న అధికారి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. షేక్ షావలి (ఎల్ ఎం /ఒపీ /అల్వాల్‌పాడ్): గద్వాల్ సర్కిల్‌లో రూ.2,500 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు అవినీతి ఆరోపణలు నిరూపణ అయ్యాయి. కేసు నంబర్: 18-సి2/2026. ఈ కేసు కూడా విజిలెన్స్ విచారణలో బయటపడింది. జిల్లాలో ఇద్దరు విద్యుత్ అధికారులు డిజిటల్ పేమెంట్ ద్వారా డబ్బులు వసూలు చేయడం రుజువు కావడం తో విద్యుత్ అధికారులు సస్పెన్షన్ చేశారు.

Next Story