- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
పత్రిక, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి పాత్రికేయులు డిమాండ్ చేశారు.

దిశ, కల్వకుర్తి : పత్రిక, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి పాత్రికేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మండల పరిధిలోని జీడిపల్లి గ్రామ శివారులో అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ నిర్వహించారనే సమాచారంతో స్థానిక పాత్రికేయులు 10 మందికి పైగా ఘటన స్థలానికి వెళ్లారు. ఘటన స్థలాన్ని కవరేజ్ చేస్తున్న తరుణంలో పొలం కౌలు దారుడు (గతంలో పొలం యజమాని) ఆయన అనుచరగణం, ఓ ప్రజాప్రతినిధి పాత్రికేయులకు దాడులకు దిగారు. ఇష్టరీతిగా నానా బూతులు తిడుతూ పాత్రికేయులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అనంతరం జర్నలిస్టులను అడ్డుకొని దాడి చేయడానికి యత్నించారు. ఈ విషయమై శుక్రవారం పాత్రికేయులు స్థానిక పోలీస్ స్టేషన్ లో వారిపై ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలని సీఐ, ఎస్ఐ లకు తెలిపారు.






