- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దోపిడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష
దోపిడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించారు మహబూబ్ నగర్ స్పెషల్ మొబైల్ కోర్ట న్యాయమూర్తి మహమ్మద్ మునవర్ హుస్సెన్. సోమవారం తీర్పు వెల్లడించారు.

దిశ, నవాబుపేట : దోపిడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించారు మహబూబ్ నగర్ స్పెషల్ మొబైల్ కోర్ట న్యాయమూర్తి మహమ్మద్ మునవర్ హుస్సెన్. సోమవారం తీర్పు వెల్లడించారు. మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంలో కూచూరు గ్రామానికి చెందిన నిందితుడు పుంటికూర కరుణాకర్ బాధితురాలును ఉదండాపూర్ లో వదిలేస్తానని బైకు పై ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి.. బీర్ బాటిల్ తో తలపై దాడి చేసి గాయపరిచాడు. ఆమె వద్ద ఉన్న రూ.20వేలు, 4 గ్రాముల బంగారు నల్లపూసల దండ, 20 తులాలల వెండి గొలుసులు లాక్కొని బైకు పై పారిపోయాడు. 2024 డిసెంబర్ 07న నవాబుపేట పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 263/2024 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
విచారణ తరువాత నిందితుడిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. మహబూబ్ నగర్ స్పెషల్ మొబైల్ కోర్టులోకి కేసు సోమవారం విచారణకు వచ్చింది. సాక్ష్యాధారాలను, వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం నిందితుడిని దోషిగా తేల్చి 309 (6) ప్రకారం.. రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మహబూబ్ నగర్ రూరల్ సర్కిల్ సీఐ గాంధీ నాయక్ దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం తరపున కోర్టులో ఏపీపీ ఎస్.ఎన్. విశ్వరేఖ వానదలు వినిపించారు. నవాబుపేట ఎస్హెచ్ఓ విక్రమ్, సీడీఓ ఎం. విజయ్ కుమార్ డాక్యుమెంటేషన్ నిర్వహించారు. ఈ తీర్పుతో నిందితుడికి తగిన శిక్ష పడిందని పోలీసులు తెలిపారు. న్యాయశాఖ అధికారులను, పోలీస్ అధికారులను ఎస్పీ జానకి అభినందించారు.






