ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ విడుద‌ల చేయాల‌ని సీఎం దిష్టిబొమ్మ ద‌హ‌నం : ఏబీవీపీ

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను జడ్చర్ల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ విడుద‌ల చేయాల‌ని సీఎం దిష్టిబొమ్మ ద‌హ‌నం : ఏబీవీపీ
X

దిశ, జడ్చర్ల : విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను జడ్చర్ల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వాగత ఆర్చి కి వేలాడదీసి దహ‌నం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం విద్యార్థులు మాట్లాడుతూ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న నేటికి కూడా ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని దీంతో అనేక ప్రైవేట్ కళాశాలలు మూతపడి విద్యార్థుల జీవితాలు రోడ్డున పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.8500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని చెల్లించాల్సిన మొత్తం బకాయిలను చెల్లించకుండా 3,000 కోట్ల రూపాయలను విడతలవారీగా చెల్లిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క అనడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయి ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. లేనియెడల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కార్యచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఏబీవీపీ నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story