ఇంటర్మీడియట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల సత్తా

by Ratna Kumari |

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజన వసతి, నాణ్యమైన విద్యా సదుపాయాలతో నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల సత్తా
X

దిశ, మహమ్మదాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజన వసతి, నాణ్యమైన విద్యా సదుపాయాలతో నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ రమ ఒక ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 26 మంది విద్యార్థులు హాజరై 26 మంది ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలు నమోదు చేశారు. ఇందులో కే. లావణ్య 470లో 467 మార్కులు సాధించి ప్రథమ స్థానం సాధించగా, డి. జస్వంతి 460, కే. నందిని 459 మార్కులు సాధించారు. ఫస్ట్ ఇయర్ బైపీసీ విభాగంలో 39 మందిలో 37 మంది ఉత్తీర్ణత సాధించి 94 శాతం ఫలితాలు నమోదు కాగా, కె. సింధు, సిహెచ్. నికిత, జె. అర్చన ముగ్గురు విద్యార్థులు 440లో 434 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 37 మంది విద్యార్థులు హాజరై 37 మంది ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలు నమోదు చేయగా, అత్యధికంగా 1000లో 959 మార్కులు నమోదయ్యాయి. సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో 35 మందిలో 34 మంది ఉత్తీర్ణత సాధించి 97 శాతం ఫలితాలు సాధించారు. ఈ విభాగంలో కే. కీర్తన 1000లో 967 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. జి. వీణ 956 మార్కులు, ఎన్. సాయి శ్రీ 959 మార్కులు, జేపీ శ్రావణి 949 మార్కులు సాధించారు. ఇదిలా ఉండగా మహమ్మదాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్‌లో 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్‌లో 35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంపీసీ విభాగంలో ఎం. శ్రీదేవి 895 మార్కులు సాధించగా, బైపీసీ విభాగంలో వర్షిత 962 మార్కులు, సిఈసీ విభాగంలో కొత్త భవాని 895, సవిత 975 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఫస్ట్ ఇయర్‌లో ఎంపీసీ విభాగానికి చెందిన కే. నవనీత 470లో 428 మార్కులు సాధించగా, బైపీసీ విభాగంలో సఫూరా అలీ 440లో 416 మార్కులు సాధించాడు. సిఈసీ విభాగంలో పి. పావని 500లో 341 మార్కులు, విష్ణు నాయక్ 340 మార్కులు సాధించారు. హెచ్‌ఈసీ విభాగంలో ఏ. కీర్తన 500లో 324 మార్కులు సాధించారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలే ప్రధాన కారణమని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రమ తెలిపారు. అలాగే మహమ్మదాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భీమారెడ్డి కూడా ఈ ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు మరింత శ్రద్ధతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

Next Story