స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆశాల ధ‌ర్నా

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : ఆశాల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని మండ‌లంలోని క‌ర్నీ పీహెచ్ సీ ముందు మం

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆశాల ధ‌ర్నా
X

దిశ‌, మ‌క్త‌ల్ : ఆశాల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని మండ‌లంలోని క‌ర్నీ పీహెచ్ సీ ముందు మంగ‌ళ‌వారం ధ‌ర్నా నిర్వ‌హించారు. అనంత‌రం వైద్యాధికారి తిరుప‌తికి విన‌తి ప్ర‌తం స‌మ‌ర్పించారు. సీఐటీయూ జిల్లా అధ్య‌క్షులు గోవింద‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశలు నిరంతరం పనిచేస్తున్న వారికి 3 సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు. కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం 18 వేలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మిక వర్గం పెట్టుబడుదారులు, యజమానులకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధపడినప్పుడే తమ హక్కులను కాపాడుకోగలన్నారు. సీఐటీయూ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్ని పిహేచ్ అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి అమీనా బేగం, కోశాధికారి యశోద,అనిత ఇందిరమ్మ,సుజాత, భాగ్యమ్మ మహేశ్వరమ్మ, డి జయమ్మ, బి అనిత, సులోచనమ్మ, అనురాధ, లక్ష్మి, ఎం నరసమ్మ పాల్గొన్నారు.

Next Story