- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విన్యాసాల కత్తితో యువకుడి వీరంగం
మండల పరిధిలోని జంగమయ్య పల్లి గ్రామంలో బుధవారం జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది.

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని జంగమయ్య పల్లి గ్రామంలో బుధవారం జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ ఘర్షణకు సంబంధించి ఆ గ్రామానికి చెందిన కారె అశోక్ అనే యువకుడిపై బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అదే గ్రామానికి చెందిన పరిగి వీరేశం, శైలజ దంపతులపై వీరేశం సోదరుడు శ్రీశైలం ద్వారక దంపతులపై వీరేశం కుమారుడు శివకుమార్ లపై కేసులు నమోదు చేశారు. పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని కారె అశోక్ అనే యువకుడు బీరప్ప దేవుడిని చేసే సమయంలో విన్యాసాలు చేసే కత్తిని తీసుకుని వీరేశం ఇంటి దగ్గరకు వెళ్లి వీరంగం సృష్టించగా.. అతడి చేతిలో నుంచి కత్తిని లాక్కున్న ఆయన కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి వదిలేశారు. ఈ సంఘటనలో వీరేశం, శ్రీశైలం సోదరులకు రక్త గాయాలు అయ్యాయి. కారె అశోక్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం శైలజ ఫిర్యాదు మేరకు అశోక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అశోక్ తండ్రి పార్వతయ్య ఫిర్యాదు మేరకు శైలజతో పాటు ఆమె నలుగురు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ ఘర్షణతో గాలిన పోయే కంప రెండు కుటుంబాల వారి కాళ్లకు చుట్టుకున్నట్టు అయింది అని అందరూ చర్చించుకోవడం గమనార్హం.






