చేపల దొంగతనానికి వెళ్లి...చెరువులోనే మునిగి యువకుడి మృతి

by velandi.Saikiran |

చెరువులో చేపలను దొంగిలించడానికి వెళ్లి, ప్రమాదవశాత్తు అదే చెరువులో మునిగిపోయి యువకుడు మృతి చెందిన సంఘటన

చేపల దొంగతనానికి వెళ్లి...చెరువులోనే మునిగి యువకుడి మృతి
X

దిశ, నవాబుపేట : చెరువులో చేపలను దొంగిలించడానికి వెళ్లి, ప్రమాదవశాత్తు అదే చెరువులో మునిగిపోయి యువకుడు మృతి చెందిన సంఘటన కాకర్జాల గ్రామ సమీపంలోని ఉడిత్యాల పెద్ద చెరువులో చోటు చేసుకుంది. దేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ జావిద్ (35) అనే యువకుడు... బుచ్చయ్య అనే వ్య‌క్తితో కలిసి బుధవారం చెరువు దగ్గరకు వెళ్ళాడు. బుచ్చయ్య ఒడ్డున ఉండగా జావీద్ చెరువులోకి వెళ్ళాడు.

నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత జావిద్‌ అందులో మునిగిపోయాడు. ఈ విష‌యాన్ని బుచ్చయ్య... గ్రామస్తులకు తెలిపాడు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుండి గురువారం సాయంత్రం వరకు చెరువులో గ్రామ‌స్తులు వెతికినా మృతుడి ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న నవాబుపేట ఎస్సై విక్రమ్ గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అయినా కూడా ఇంకా మృత దేహం ల‌భ్యం కాలేదు. మృతుడికి భార్య అన్వర్ తో పాటు నలుగురు కూతుర్లు ఉన్నారు.

Next Story