- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్.. యువకుడు మృతి
దిశ, భూత్పూర్ : కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి నీళ్లు పడుతుండగా విద్యుత్తు ప్రమాదం సంభవించి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో

దిశ, భూత్పూర్ : కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి నీళ్లు పడుతుండగా విద్యుత్తు ప్రమాదం సంభవించి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. తుల్జా నాయక్, సావిత్రి దంపతుల కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. దీంతో వాళ్లు నూతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం వెళ్లిపోగా ఇంటి దగ్గర ఉన్న వారి కుమారుడు కార్తీక్ నాయక్ (19) ఇంటికి నీళ్లు పడుతుండగా విద్యుత్తు ప్రమాదం సంభవించి అకస్మాత్తుగా కింద పడిపోయాడు. కొద్ది సేపటి తరువాత పక్క ఇంటివారు ప్రమాదాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర ప్రమాదానికి గురైన కార్తీక్ నాయక్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. కార్తీక్ నాయక్ మహబూబ్ ఎంవీఎస్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులకు ఒక కూతురు, కుమారుడు ఉండగా .. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.






