- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
by Elthuri vijay kumar |
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు–మాచారం గ్రామాల మధ్య నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.

X
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దిశ, అమ్రాబాద్: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు–మాచారం గ్రామాల మధ్య నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పదర గ్రామానికి చెందిన పాపయ్య కుమారుడు నల్లపోతుల వెంకటేష్ ద్విచక్రవాహనంపై మన్ననూరు నుండి అమ్రాబాద్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో వెంకటేశ్వర బావి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






