ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య.. తండ్రి చెప్పిన కారణం ఇదే..!

by Ratna Kumari |   (  Updated:2025-10-21 11:58:07  IST  )

ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మానవపాడు

ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య.. తండ్రి చెప్పిన కారణం ఇదే..!
X

దిశ‌, అలంపూర్ : తరచు ఫీట్స్ వచ్చి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మానవపాడు మండలం రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం... జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన ఆంధ్రిచెట్టు ఆనంద్ (26) వృత్తి రీత్యా కూలి పని చేసుకుంటూ ట్రాక్టర్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలంగా అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటు కొద్ది రోజులుగా ఫిట్స్ అధికంగా వస్తుండడంతో మానసికంగా బాధపడుతు కుమిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఏ ఆసుపత్రిలో చూయించినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆంధ్రిచెట్టు ఆనంద్ మానవపాడు రైల్వే స్టేషన్ సమీపంలో కాచిగూడ నుండి కర్నూల్ వైపు వెళ్తున్న స్పెషల్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నిన్న రాత్రి 7 గంటల సమయంలో జరిగి ఉండవచ్చునని పోలీసులు భావించారు. తండ్రి ఆంధ్రిచెట్టు కన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పినట్లు పోలీసులు తెలిపారు. తన కుమారునికి ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని, ఇందులో ఎవరిమీద ఎలాంటి అనుమానం లేదని మృతుడి తండ్రి తెలిపాడు. మృతుడికి వివాహమై ఏడాది అయ్యింది. భార్య, చిన్నపాప ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Next Story