అప్పుల భారంతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

దిశ‌, న‌వాబ్ పేట : అప్పుల భారం భరించలేక మండల పరిధిలోని దొడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపంగి శివకుమార్ 20 అనే యువకుడు తన ఇంటి

అప్పుల భారంతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, న‌వాబ్ పేట : అప్పుల భారం భరించలేక మండల పరిధిలోని దొడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపంగి శివకుమార్ 20 అనే యువకుడు తన ఇంటి పైగల గదిలో ఇనుప రాడ్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సంపంగి పద్మమ్మకు విష్ణు, శివకుమార్ ఇద్దరు కుమారులు క‌ల‌రు. కొంతకాలం క్రితం వారు తమ గ్రామంలో అప్పులు చేసి ఇంటిని నిర్మించుకున్నారు. ఆ తర్వాత శివకుమార్ తన తల్లి పద్మమ్మ పేర మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఆటో ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుని ఓ బొలెరో వాహనం కొనుగోలు చేసి దానిపై డ్రైవర్ గా పనిచేస్తూ ఊరిలో ఒంటరిగా జీవించేవాడు. కాగా పెద్ద కుమారుడు విష్ణు తన తల్లి పద్మమ్మ, భార్య పిల్లలను కొంతకాలం క్రితం వెంట తీసుకుని వెళ్లి షాద్ నగర్ లో కూలి పనులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడం, ఇటీవల బొలెరో వాహనానికి అప్పు ఇచ్చిన ఆటో ఫైనాన్స్ వారి వేధింపులు అధికము కావడంతో పాటు, ఫైనాన్స్ వారు మృతుడి ఇంటి ముందు గోడపై తమకు బొలెరో వాహనానికి సంబంధించిన అప్పు తిరిగి చెల్లించనందున న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ రెడ్ ఇంకుతో రాసి వెళ్లడంతో ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటున్న విష్ణు తీవ్ర భయాందోళనలకు, మానసికాందోళనకు, మనస్థాపానికిలోనై, లోలోనే కుమిలిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితో అవసరం ఉండి ఇంటికి వెళ్లి చూసిన గ్రామానికి చెందిన సంపంగి వెంకటేష్ కు మృతుడు శివకుమార్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు దాంతో ఈ విషయమై వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆయన తల్లికి అన్నకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఇంటికి వచ్చి కుమారుడి మృతదేహాన్ని చూసిన పద్మమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం. విక్రమ్ తెలిపారు.

Next Story