అప్పుల బాధ‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, గ‌ద్వాల క్రైమ్ : అప్పుల భారం తట్టుకోలేక ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గద్వాల పట్టణంలో

అప్పుల బాధ‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, గ‌ద్వాల క్రైమ్ : అప్పుల భారం తట్టుకోలేక ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణం పిల్లి గుండ్ల కాలనీలో నివాసం ఉంటున్న గట్టు మండలం అరిగిద్ద గ్రామానికి చెందిన నరసింహ ఆచారి (23) అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో నరసింహ ఆచారి ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. అప్పుల ఒత్తిడి పెరగడంతో మానసికంగా కుంగిపోయిన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న గద్వాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పిల్లి గుండ్ల కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువ వయసులోనే నరసింహ ఆచారి మృతి చెందడం స్థానికులను కలచివేసింది.

Next Story