- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-2 : పురిటి నొప్పులతో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన మహిళ
by Muthe.Rajitha |
పురిటి నొప్పులతోనే గ్రూప్ 2(Group2) పరీక్ష రాసిన ఘటన నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : పురిటి నొప్పులతోనే గ్రూప్ 2(Group2) పరీక్ష రాసిన ఘటన నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్(Nagarkarnul) జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి(Revathi) నిండు గర్భిణి. నాగర్ కర్నూల్ పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన ఇన్విజిలేటర్స్ ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ ను పిలవగా.. దీనికి రేవతి అంగీకరించలేదు. తాను పరీక్ష రాశాకే ఆసుపత్రికి వెళ్తానని పట్టుబట్టడంతో, అధికారులు సమస్యను కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకు వెళ్లారు. పరీక్ష కేంద్రంలో 108 తోపాటు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రేవతిని ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.
- Tags
- Group-2
Next Story






