వేధింపులు భ‌రించ‌లేక భర్తను చంపిన భార్య

by Ratna Kumari |

దిశ, రేవల్లి : వేధింపుల‌ను భ‌రించ‌లేక క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది ఓ భార్య‌. ఆమెకు తోడుగా త‌ల్లి, సోద‌రులు స‌హ‌క‌రించారు. ఈ ఘ‌ట‌న వ‌న‌ప‌ర్తి జిల్లా రేవ‌ల్లి మండ‌లం చెన్నారం

వేధింపులు భ‌రించ‌లేక భర్తను చంపిన భార్య
X

దిశ, రేవల్లి : వేధింపుల‌ను భ‌రించ‌లేక క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది ఓ భార్య‌. ఆమెకు తోడుగా త‌ల్లి, సోద‌రులు స‌హ‌క‌రించారు. ఈ ఘ‌ట‌న వ‌న‌ప‌ర్తి జిల్లా రేవ‌ల్లి మండ‌లం చెన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను డీఎస్పీ వెంకటేశ్వ‌ర్ రావు విలేక‌ర్ల స‌మావేశంలో వెల్ల‌డించారు. పాన్ గ‌ల్ మండ‌లం అన్న‌వ‌రం గ్రామానికి చెందిన న‌ర‌సింహ కి చెన్నారం గ్రామానికి చెందిన శివ‌లీల‌తో వివాహం జ‌రిగింది. న‌ర‌సింహ మ‌ద్యానికి బానిసై శివ‌లీల‌ను వేధించేవాడు. అయితే గ‌త 20 రోజుల కింద‌ట న‌ర‌సింహ భార్య శివ‌లీల‌ను మ‌ద్యం సేవించేందుకు డ‌బ్బులు అడిగాడు. ఆమె ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆమె ఆధార్ కార్డు, చంద‌న బ్ర‌ద‌ర్స్ షాపు వారు జారీ చేసిన గుర్తింపు కార్డును గుంజుకొని ఇంట్లోకి రానివ్వ‌కుండా బ‌య‌టికి వెళ్ల‌గొట్టాడు. దీంతో ఆమె ఆరోజు రాత్రి అంతా బ‌య‌టే ప‌డుకొని.. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆమె త‌మ్ముడు లోకేష్ చెన్నారం కి వెళ్లి.. శివ‌లీల‌, కూతురు దీప్తిల‌ను బైకుపై తీసుకొచ్చాడు.

ద‌స‌రా పండుగ కోసం ఆమె అన్న శ‌శికిర‌ణ్, త‌మ్ముళ్లు గంగాధ‌ర్, లోకేష్ హైద‌రాబాద్ నుంచి వ‌చ్చారు. దీంతో శివ‌లీల త‌న భ‌ర్త వేదింపుల గురించి వారితో చెప్ప‌గా. వారంద‌రూ క‌లిసి ఇంటికి పిలిచి చంపాల‌ని ప‌త‌కం ప‌న్నారు. ప‌థ‌కంలో భాగంగా అక్టోబ‌ర్ 03న రాత్రి సుమారు 10 గంట‌ల స‌మ‌యంలో చెన్నారంలో అంద‌రూ క‌లిసి మ‌ద్యం సేవించారు. అనంత‌రం న‌ర‌సింహ క‌ళ్ల‌లో కారం పొడి చ‌ల్లి చీపురు క‌ట్ట‌తో, వ్యాయామానికి ఉప‌యోగించే డంబెల్ తో త‌ల‌పై, వీపు పై బ‌లంగా కొట్టారు. ఒంటిపై పిడిగుద్దులు.. అతి దారుణంగా చంపారు. ఈ విష‌యం తెలుసుకున్న మృతుడు న‌ర‌సింహ‌ తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేప‌ట్ట‌గా.. ఐదుగురు క‌లిసి హ‌త్య చేసిన‌ట్టు ఒప్పుకున్నారు. ఐదుగురు శివ‌లీల‌తో పాటు ఆమె త‌ల్లి, అన్న శ‌శికిర‌ణ్, త‌మ్ముళ్లు గంగాధ‌ర్, లోకేష్ లు నిందితులు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. ఈ హ‌త్య కేసును ఛేదించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన వ‌న‌ప‌ర్తి సీఐ కృష్ణ‌య్య‌, ఎస్సై ర‌జిత‌, సిబ్బంది న‌గేష్, చంద్ర‌శేఖ‌ర్, మౌలానా, ఆంజ‌నేయులు, రామ‌కృష్ణ‌, మ‌హిళా కానిస్టేబుల్ శుష్మ‌ల ను డీఎస్పీ అభినందించారు.

Next Story