- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
దిశ, అమరచింత : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనల్లో భాగంగా సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరుకి చేరుకున్నారు. ఈ సందర్భంగా

దిశ, అమరచింత : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనల్లో భాగంగా సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరుకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి శ్రీహరి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ పట్టణ, పీజేపీ క్యాంపు ఆవరణలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి వాకిటి శ్రీహరితో కలసి రూ.173 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.122 కోట్లతో ఆత్మకూర్ నుంచి జోగులంబ గద్వాలకు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, అదేవిదంగా రూ.22కోట్లతో 50 పడకల హాస్పటల్ నిర్మాణం, అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీల్లో మౌళిక వసతుల కోసం రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతకు ముందు జాతర మైదానం నుంచి సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు షోలో పాల్గొని, శంకుస్థాపన స్థలానికి చేరుకున్నారు. కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వనపర్తి జిల్లా బీసీసీ అధ్యక్షులు శివసేనరెడ్డి,ఎమ్మెల్యేలు మెగా రెడ్డి, జిఎంఆర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సరిత తిరుపతయ్య ఉన్నారు.






