- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోనాపూర్ తాండ లో కొబ్బరి చెట్టుపై పిడుగు
by Ratna Kumari |
మండల పరిధిలోని కోనాపూర్ తాండ లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం సమయంలో పిడుగు పడిన ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వంగూర్ : మండల పరిధిలోని కోనాపూర్ తాండ లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం సమయంలో పిడుగు పడిన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ కొబ్బరి చెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడటంతో పెద్ద శబ్దం వినిపించి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిడుగు ప్రభావంతో కొబ్బరి చెట్టు కొంత భాగం దెబ్బతినగా, సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్త మయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story






