- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లాపూర్ పెంటలో కాలిబూడిదైన గుడిసె
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామం ఆమ్లెట్ గ్రామమైన నల్లమల లోతట్టు ప్రాంతం మల్లాపూర్ పెంటలో ఆదివారం చిగుర్లు చిన్న గంగయ్యా పూరి గుడిసె ప్రమాదవ శత్తు కాలి బూడిదైంది.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామం ఆమ్లెట్ గ్రామమైన నల్లమల లోతట్టు ప్రాంతం మల్లాపూర్ పెంటలో ఆదివారం చిగుర్లు చిన్న గంగయ్యా పూరి గుడిసె ప్రమాదవ శత్తు కాలి బూడిదైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ యజమాని అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లగా.. ఆయన సతీమణి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఇంటివద్ద ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఈ క్రమంలో గుడిసె సూర్ లో అగ్గిపెట్టె ఉన్న సందర్భంగా విపరీతమైన ఎండ తీవ్రత ఉండటంతో అనుకోకుండా మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఆ క్రమంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. తిండి గింజలతో పాటు నిత్యావసర వస్తువులన్నీ కాళీ బూడిద అయ్యాయని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి చేశారు.
Next Story






