- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టిలో పుట్టిన మాణిక్యం
తెలంగాణకు ప్రాణం లాంటి బతుకమ్మ పండుగ రాగానే, సుధాకర్ తనలోని సృజనాత్మకతను పాట రూపంలో బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. "మట్టిలోన పుట్టినావే గౌరమ్మ" అనే గీతాన్ని రాశాడు.

మట్టిలో పుట్టిన మాణిక్యం
* బతుకమ్మ పాటతో వెలుగులోకి రంగం సుధాకర్
* వృత్తిరీత్యా ఆర్టిసి డిపోలో కానిస్టేబుల్... ప్రవృత్తి గీత రచయితగా రాణింపు
* ఆకట్టుకుంటున్న సరికొత్త బతుకమ్మ పాట
దిశ, మాగనూర్ : నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం గురు లింగంపల్లి గ్రామం. సాధారణ రైతు కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగిన రంగం సుధాకర్ జీవితం చిన్నప్పటి నుంచే కష్టాలతో ముడిపడి ఉంది. తండ్రి రంగం శాంతప్ప, తల్లి నర్సింగమ్మ ఇద్దరూ రైతులే. కష్టార్జితంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ, చదువు నేర్పించి మంచి స్థాయికి చేర్చాలని కలలు కన్నారు. ప్రస్తుతం సుధాకర్ ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నా, తన మనసులో ఎప్పుడూ ఒక సృజనాత్మక తపన మెదులుతూనే ఉండేది.. చిన్నప్పటి నుంచి పద్యరచన, గేయరచన పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ఆ ప్రతిభను బయటపెట్టడానికి పెద్ద వేదిక దొరకలేదు.
బతుకమ్మ పండుగ.. సుధాకర్‌కు వేదిక
తెలంగాణకు ప్రాణం లాంటి బతుకమ్మ పండుగ రాగానే, సుధాకర్ తనలోని సృజనాత్మకతను పాట రూపంలో బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. "మట్టిలోన పుట్టినావే గౌరమ్మ" అనే గీతాన్ని రాశాడు. ఈ పాటలో గ్రామీణ సంస్కృతి, తెలంగాణ సొబగులు, గౌరమ్మ పట్ల భక్తి అన్నీ కలిపి ప్రతిబింబించేలా పదాలు రాశారు. ట్యూన్ కాన్సెప్ట్ ను కమల్ కళ్యాణ్ అందించగా, హరికథ మూవీ టీం ముందుకొచ్చి ఈ పాటను లాంచ్ చేసింది. సాంప్రదాయాన్ని ఆధునికతతో కలిపిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల మనసులను తాకేలా ఉంది.
సాధారణ యువకుడి అసాధారణ అడుగు
రైతు కుటుంబం నుంచి వచ్చి, ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తూనే తన కలను నెరవేర్చిన సుధాకర్ కథ ప్రతి యువకుడికి ప్రేరణ. "సృజనాత్మకతకు వేదిక దొరకాలి గానీ ఆగిపోకూడదు" అనే నిజాన్ని ఆయన నిరూపించాడు.
మక్తల్ గర్వించదగ్గ ప్రతిభ
సుధాకర్ మక్తల్ వాసి కావడంతో స్థానిక ప్రజలు ఆయన ప్రతిభను గుర్తించి సపోర్ట్ చేస్తున్నారు. "మన ఊరి యువకుడు ఇంత మంచి పాట రాశాడు, అందరం కలిసి ప్రోత్సహిద్దాం" అనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది.






