- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ స్కూల్స్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలి
ప్రైవేటు ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ప్రైవేట్ స్కూల్స్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలి
- ట్రస్మా వెల్ఫేర్ ఫండ్ కు రూ. 10 లక్షలు కేటాయిస్తా
-ప్రైవేటు ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం ప్రైవేటు విద్యాసంస్థలు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన సన్మాన, అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్య బీమా ఎంతో అవసరం. యాజమాన్యానికి, అధ్యాపకులు, సిబ్బందికి ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతినెల ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, సిబ్బంది రూ.250 చెల్లిస్తే. దానికి అదనంగా మరో రూ.250 కలిపి వెల్ఫేర్ ఫండ్ జమ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలలు, సిబ్బంది , మేనేజ్మెంట్ కలిపి ఫండ్ జమ చేస్తే 5 ఏళ్లలో రూ.13 కోట్లు జమ అవుతాయని ఎమ్మెల్యే చెప్పారు. ట్రస్మా వెల్ఫేర్ ఫండ్ కు తన వంతుగా రూ.10 లక్షలు అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. జిల్లాలో 65 శాతం విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పాఠశాలల సమస్యలను పరిష్కరించుకునేందుకు అందరం కృషి చేయాలన్నారు. వలసల జిల్లాగా పేరుపొందిన మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాకు ఇంజనీరింగ్, లా, ట్రిపుల్ ఐటీ కళాశాలలను మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అవసరమైన కంపెనీలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం ఆయా పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్, ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే అవార్డులు అందజేశారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మధుసూదన్, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. క్రాంతి కుమార్, పట్టణ అధ్యక్షుడు జీవంశీ మోహన్, లుంబిని లక్ష్మణ్ గౌడ్, కిరణ్మయి, విజేత వెంకట్ రెడ్డి, జనజం రమేష్ గౌడ్, అక్షర విజయ్ కుమార్, జిల్లాలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






