ఆటో నుంచి కింద ప‌డి వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ‌, ఎర్ర‌వ‌ల్లి : ఆటోలో నుంచి కింద‌ప‌డి వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఎర్ర‌వ‌ల్లి మండ‌లం దువాసిప‌ల్లిలో గ్రామంలో చోటు చేసుకుంది. కోదండ‌పురం ఎస్సై

ఆటో నుంచి కింద ప‌డి వ్య‌క్తి మృతి
X

దిశ‌, ఎర్ర‌వ‌ల్లి : ఆటోలో నుంచి కింద‌ప‌డి వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఎర్ర‌వ‌ల్లి మండ‌లం దువాసిప‌ల్లిలో గ్రామంలో చోటు చేసుకుంది. కోదండ‌పురం ఎస్సై ముర‌ళి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌ద్దెపోగు పెద్ద బిస‌న్న(65) శ‌నివారం ఎర్ర‌వ‌ల్లి నుంచి దువాసిప‌ల్లి వెళ్లేందుకు AP21TX9619 నెంబ‌ర్ గ‌ల ఆటోను ఎక్కాడు. అయితే గార్ల‌పాడు కు చెందిన మ‌హేష్ ఆటో ప‌రిమితికి మించి ఫ్యాసింజ‌ర్లను ఎక్కించుకున్నాడు. ఆటోను అతివేగంతో న‌డిపిన‌ట్టు స‌మాచారం. అయితే సాస‌నూల్ బ‌స్టాండ్ దాటిన త‌రువాత ఆటోలో పెట్రోల్ అయిపోయింద‌ని వేగం పెంచ‌డంతో ఆటో డ్రైవ‌ర్ కుడి వైపు కూర్చున్న గ‌ద్దెపోగు పెద్ద బిస‌న్న ఆటోలో నుంచి కింద జారీ ప‌డ్డాడు. దీంతో త‌ల వెనుక భాగాన తీవ్ర గాయాల‌య్యాయి. చికిత్స కోసం అంబులెన్స్ లో క‌ర్నూల్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రీక్షించి మార్గ‌మ‌ధ్య‌లోనే బీస‌న్న మృతి చెందిన‌ట్టు ధృవీక‌రించారు. దీంతో బిస‌న్న కుమారుడు గ‌ద్దెపోగు ఏస‌న్న ఫిర్యాదు మేర‌కు ఆటో డ్రైవ‌ర్ మ‌హేష్ పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై ముర‌ళి తెలిపారు.

Next Story