అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగర్ కర్నూల్ : అనుమాన్నాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్‌ జిల్లా గుడిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, నాగర్ కర్నూల్ : అనుమాన్నాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్‌ జిల్లా గుడిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన రాము యాదవ్( 30 ), మానస భార్య భర్తలు. రాము ప్లంబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజుల క్రితం వారి ఇంట్లో బంగారం చోరికి గురైంది. పెద్దముదునూరు గ్రామంలో సురేష్ అనే వ్యక్తి బంగారం కనిపెడతాడని తెలిసి అతని వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో భార్య మానసతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి చేసింది. గత మూడు రోజుల కింద‌ట‌ గుడిపల్లి గ్రామంలోని తమ బంధువుల పెళ్లికి వెళ్లిన రాము యాదవ్ ఆదివారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంతో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి గ్రామస్తులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదం వల్లే మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు భార్యపై అనుమానం వ్యక్తం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు సురేష్ తో పాటు భార్య మానసని అదుపులోకి తీసుకున్నట్టు స‌మాచారం.

Next Story