చెట్టు న‌రుకుతుండ‌గా మీద ప‌డి వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

చెట్టు న‌రుకుతుండ‌గా మీద ప‌డి వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మండ‌లంలోని ఉందేకోడ్ గ్రామంలో చోటు చేసుకుంది.

చెట్టు న‌రుకుతుండ‌గా మీద ప‌డి వ్య‌క్తి మృతి
X

దిశ‌, న‌ర్వ : చెట్టు న‌రుకుతుండ‌గా మీద ప‌డి వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మండ‌లంలోని ఉందేకోడ్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉందేకోడ్ గ్రామానికి చెందిన బొంప‌ల్లి చాక‌లి రాజు(34) పాత‌ర్చేడ్ గ్రామ శివారులో బుధ‌వారం చెట్టు న‌రుకుతుండ‌గా అది అక‌స్మాత్తుగా అత‌ని మీద కూలింది. దీంతో అత‌ను మృతి చెందాడు. మక్త‌ల్ మండ‌లంలోఇన గుడిగండ్ల గ్రామానికి చెందిన శివ‌తో దిన‌స‌రి కూలీగా ప‌ని చేస్తున్నాడు. బుధ‌వారం కూడా చెట్లు న‌రికేందుకు కూలికి వెళ్లాడు. చెట్టు కూలి మీద ప‌డ‌టంతో చ‌నిపోయాడ‌ని తోటి కూలీలు తెలిపారు. ఫారెస్ట్ అనుమ‌తి లేకుండానే గుడిగండ్ల శివ చెట్లు న‌రికి సొమ్ము పోగు చేసుకుంటున్నట్టు స‌మాచారం. మృతుడికి భార్య న‌ర్మ‌దా, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.

Next Story