విద్యుత్ కంచెలో ప‌డి వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ‌, రేవ‌ల్లి : మండల పరిధిలోని కొంకలపల్లి గ్రామానికి చెందిన పెద్దముక్కుల భాషా వ్య‌వ‌సాయం చేస్తుంటాడు. అత‌ని తో పాటు కుటుంబ స‌భ్యులంద‌రూ క‌ష్ట‌ప‌డి పంట‌ను

విద్యుత్ కంచెలో ప‌డి వ్య‌క్తి మృతి
X

దిశ‌, రేవ‌ల్లి : మండల పరిధిలోని కొంకలపల్లి గ్రామానికి చెందిన పెద్దముక్కుల భాషా వ్య‌వ‌సాయం చేస్తుంటాడు. అత‌ని తో పాటు కుటుంబ స‌భ్యులంద‌రూ క‌ష్ట‌ప‌డి పంట‌ను పండిస్తే.. ఆపంట‌ను అడ‌వి పందులు పాడు చేస్తున్నాయ‌ని విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు. అదే గ్రామానికి చెందిన కొంక‌ల సంజీవ‌(55) ప‌డి మృతి చెందిన ఘ‌ట‌న శుక్ర‌వారం ఉద‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొంక‌ల సంజీవ గురువారం మ‌ధ్యాహ్నం రేవ‌ల్లి మండ‌ల కేంద్రానికి వ‌చ్చి మ‌ద్యం సేవించాడ‌ని.. అది ఎక్కువ అవ్వ‌డంతో రోడ్డు వెంట వెళ్లితే చూసిన వారు ఎగ‌తాళిగా మాట్లాడుతుంటార‌ని, స్వ‌గ్రామం కొంక‌ల‌ప‌ల్లికి పాత బాట వెంబ‌డి వ‌చ్చి విద్యుత్ కంచెలో ప‌డి చనిపోయాడు. మృతుడికి భార్య కొంక‌ల ల‌క్ష్మీ, ఓ కూతురు, ఓ కుమారుడు క‌ల‌రు.

Next Story