- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమీషన్ల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడి దాడి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, బోయాపూర్ గ్రామంలో గత ఏడాది క్రితం రు.10 లక్షలతో వేసిన సీసీ రోడ్డు కమీషన్ల పంచాయితీ బుధవారం పోలీస్ స్టేషన్ కు చేరింది.

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, బోయాపూర్ గ్రామంలో గత ఏడాది క్రితం రు.10 లక్షలతో వేసిన సీసీ రోడ్డు కమీషన్ల పంచాయితీ బుధవారం పోలీస్ స్టేషన్ కు చేరింది. రూ. 10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి బోయపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు రూ.75వేలు వసూళ్లు చేయగా వాటి పంపకంలో సయోధ్య కుదరకపోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏకంగా అధికారుల ముందే పంపకాలు జరుపుకోవడం విశేషం. పంపకాలలో తేడాలు రావడంతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా చివరికి పెద్ద సారు మందలించినట్లు తెలిసింది.
చివరగా ఈ పంచాయతీ పెద్ద సార్ ముందుకు వెళ్లడంతో చర్చనీయంశంగా మారింది. మండలంలోని బోయాపూరు గ్రామంలో ఏడాది క్రితం రూ.10 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు కాగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు వెయ్యడానికి కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.75 వేలకు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత 8.5 లక్షల బిల్లు ఈ వారమే కాంట్రాక్టర్ ఖాతాలో పడింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.75 వసూళ్లు చేశారు.రూ.60 వేలు యూపిఐ ద్వారా పేమెంట్ కాగా, మిగిలిన పదివేలు నగదు రూపకంగా బదిలీ చేసుకున్నారు. ఈ కమిషన్ తీసుకున్న కాంగ్రెస్ నాయకులు ముగ్గురికి సమాన భాగాలుగా పంచాలని పంచాయతీ పెట్టారని తెలిపారు. గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు వచ్చి నాకు కూడా సమానంగా కావాలని పలుసార్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపాడు.
గత సోమవారం ఈ పంపకాలు పూర్తి కాగా బుధవారం ఉదయం దాదాపు 8:30 బొయాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కాపు కాసి గ్రామంలోనే నేను నా భార్య బైక్ పై వెళుతుండగా గ్రామ మధ్యలో పట్టుకొని దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో గాయపడిన సైదులు తలకు బలంగా గాయం కావడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. గతం నుంచి భూతగాదాలు పాలు భాగాలు ఉండటంతో ఆ పంచాయితీ కీలకంగా ఉన్న వ్యక్తి కక్ష సాధింపుగానే నాపై దాడి చేశారని బాధితుడైన సైదులు దిశాకు తెలిపారు. ఈ విషయంలో బిజినేపల్లి ఎస్సై శ్రీనివాసులను వివరణ కోరగా బోయపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సైదులు అనే వ్యక్తి నుండి ఫిర్యాదు అందిందని.. ఫిర్యాదు పై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.






