- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
దిశ, రేవల్లి : అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రజిత తెలిపిన వివరాల ప్రకారం.. రేవల్లి మండల పరిధిలోని

దిశ, రేవల్లి : అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రజిత తెలిపిన వివరాల ప్రకారం.. రేవల్లి మండల పరిధిలోని కేశంపేట తండాకు చెందిన నున్సావత్ బావ్ సింగ్(35) కుటుంబ కలహాలు, అప్పుల బాధతో అనుమానస్పదంగా మృతి చెందాడు. గత కొద్ది సంవత్సరాల క్రితం పానగల్ మండలం రేమద్దుల గుడ్లవల్యా నాయక్ తండాకు చెందిన చిట్టితో బావ్ సింగ్ కి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. కొద్ది సంవత్సరాల కిందటే కూతురు పెళ్లి చేశారు. అలాగే గ్రామంలో నూతనంగా ఇళ్లును నిర్మించుకోవడంతో అప్పులు అధికమయ్యాయి. దీంతో తన భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్ లో కూలీగా పని చేస్తూ జీవించేవాడు. ఈనెల 09న వీరి కుటుంబం పాతతండాకు వచ్చారు. కుటుంబ విషయాలపై ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.. ఇవాళ మృతుడు తన ఇంట్లో ఉన్న ఉయ్యాలకొండికి అనుమానస్పదంగా చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడి మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. మరోవైపు మృతుని ఇంట్లో నేలపై అక్కడక్కడ రక్తపు మరకలు ఉండటం, మృతుని ఒంటిపై ఉన్న బట్టలు చినిగిపోయి ఉండటాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గమనించి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. మృతుని తల్లి తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రజిత తెలిపారు.






