కుక్కను తప్పించ బోయి ప్రమాదంలో వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, కొత్తకోట : కుక్కను తప్పించబోయి ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే వనపర్తి జిల్లా కొత్తకోట

కుక్కను తప్పించ బోయి ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, కొత్తకోట : కుక్కను తప్పించబోయి ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన యాహియ, (27)అనే యువకుడు మదనాపురం మండల కేంద్రంలో మొబైల్ షాప్ నడిపేవాడు. షాపు మూసివేసి, బైక్ పై వస్తున్న క్రమంలో కొత్తకోట ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి.. అదుపు తప్పి కింద పడి పోవడంతో, తలకు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం మహబూబ్ న‌గ‌ర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన యాహియకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story