ప‌ట్ట ప‌గ‌లే మ‌హిళా మెడ‌లో రెండు తులాల‌ పుస్తెల తాడు చోరీ

by Ratna Kumari |

ప‌ట్ట ప‌గ‌లే ఓ మ‌హిళా మెడ‌లోంచి రెండు తులాల‌ పుస్తెల తాడు చోరీ చేశారు ముగ్గురు దుండ‌గులు. ఈ ఘ‌ట‌న జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ప‌ట్ట ప‌గ‌లే మ‌హిళా మెడ‌లో రెండు తులాల‌ పుస్తెల తాడు చోరీ
X

దిశ, జడ్చర్ల : ప‌ట్ట ప‌గ‌లే ఓ మ‌హిళా మెడ‌లో చైన్ స్నాచింగ్ కి పాల్ప‌డిన ఘ‌ట‌న జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో చోటు చేసుకుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలోని మూడో వార్డులోని కృష్ణారెడ్డి న‌గ‌ర్ లో మంజుల అనే మ‌హిళా ల‌క్ష్మీన‌ర‌సింహ కిరాణ జ‌న‌ర‌ల్ స్టోర్ తో పాటు లేడీస్ టైల‌రింగ్ న‌డిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే బైకు పై నుంచి వ‌చ్చి ముగ్గురు దుండ‌గులు కిరాణ షాపులోని మంజుల అనే మ‌హిళా వ‌ద్ద‌కు వెళ్లి లీట‌ర్ వాట‌ర్ బాటిల్ కావాల‌ని అడిగాడు. ఆమె దుండ‌గుడికి వాట‌ర్ బాటిల్ ఇచ్చేందుకు కౌంట‌ర్ వ‌ద్ద‌కు రాగానే క్ష‌ణాల్లో ఆమె మెడ‌లోంచి రెండు తులాల పుస్తెల తాడు లాక్కొని ద్విచ‌క్ర వాహ‌నం పై ప‌రార‌య్యారు.

దీంతో ఒక్క‌సారిగా షాక్ కి గురైన మ‌హిళ కేక‌లు వేస్తూ బ‌య‌టికి వ‌చ్చింది. దుండ‌గులు వేగంగా ద్విచ‌క్ర వాహ‌నం పై ప‌రార‌య్యారు. అదే స‌మ‌యంలో కాల‌నీ రోడ్డు పై ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో దుండ‌గుల‌కు క‌లిసి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాధిత కుటుంబ స‌భ్యులు ఈ విష‌యాన్ని వెంట‌నే జ‌డ్చ‌ర్ల పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పాట్ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసుకొని కేసును వేగంగా ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. ప‌ట్ట‌ప‌గ‌లే ఓ మ‌హిళా మెడ‌లో నుంచి బంగారు ఆభ‌ర‌ణాల‌ను లాక్కెళ్లార‌ని జ‌డ్చ‌ర్ల ప్రాంతం అంతా ఈ ఘ‌ట‌న గురించే చ‌ర్చించుకోవ‌డం విశేషం.

Next Story