వైద్యం విక‌టించి బాలుడి మృతి.. NHRCలో న్యాయవాది ఫిర్యాదు

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని కురపల్లి గ్రామానికి చెందిన వరుణ్ తేజ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మృతి చెందడం పై

వైద్యం విక‌టించి బాలుడి మృతి..  NHRCలో  న్యాయవాది ఫిర్యాదు
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని కురపల్లి గ్రామానికి చెందిన వరుణ్ తేజ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మృతి చెందడం పై యువ న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ తీవ్రంగా పరిగణిస్తూ ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల సంఘం మానవ హక్కుల సంఘం లో ఫిర్యాదు చేశారు. సరైన సర్టిఫికెట్స్ వైద్య పరిజ్ఞానం లేకుండా ఆర్ఎంపీలు డాక్టర్ల పేరుతో గ్రామాల్లో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాలుతున్నారని వారిపై తక్షణమే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. దీంతో గ్రామాల్లో వైద్యం నిర్వహిస్తున్న వారికి సరైన లైసెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, నియమ, నిబంధనలను పకడ్బందీగా అమలయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్ఎంపీ శ్రీశైలం నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన వరుణ్ తేజ కుటుంబానికి నష్టపరిహారం అందించాలని లేఖ‌లో కోరారు.

Next Story