- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంగూరులో భద్రతా బలోపేతానికి కీలక నిర్ణయం
మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామ ప్రజాప్రతినిధులు ముందడగు వేశారు.

దిశ, వంగూర్ : మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామ ప్రజాప్రతినిధులు ముందడగు వేశారు. గ్రామ సర్పంచ్ పురుగుల యాదయ్య ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.1,00,000 విలువైన చెక్కును ఎస్సై మహేష్ గౌడ్ కి శుక్రవారం అందజేశారు. మండల కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో, ప్రజా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ చర్యతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, అలాగే అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు దోహదపడుతుం దని సర్పంచ్ పురుగుల యాదయ్య తెలిపారు. గ్రామ భద్రతకు ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అభినందనీయ మని పేర్కొన్నారు. ఎస్సై మహేష్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారం పోలీసు శాఖకు ఎంతో తోడ్పడుతుందని, సీసీ కెమెరాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి, భద్రత పట్ల కట్టుబాటుతో తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భాస్కర్, వార్డ్ మెంబర్స్ శివకుమార్, మల్లేష్, సత్యనారాయణ, జంగయ్య, మురళి, శైలజకృష్ణ, రఫీ, రాజు పాల్గొన్నారు.






