- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, గద్వాల : పంటపొల్లాలో భారీ మొసలి ప్రత్యక్షం కావడంతో రైతులు కూలీలు భయాందోళనకు గురయ్యారు. మల్దకల్ మండల కేంద్రంలోని దేవర చెరువు వెనుక చాకలి కందన్న సవారి సీడ్ పత్తి పొలంలో భారీ మొసలి ప్రత్యక్షం అయింది. శుక్రవారం ఉదయం పనిచేయడానికి కూలీలు పత్తి చేనులోకి వెళ్లగా భారీ మొసలి ప్రత్యక్షవడంతో గుండె ఆగినంత పని అయింది. వెంటనే రైతులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు వ్యవసాయ పొలానికి చేరుకుని మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. తప్పించుకుని పక్కన ఉన్న బావిలోకి వెళ్లడంతో అధికారులు పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు.
Next Story






