స్నేహితుడి కుటుంబానికి చేయూత

by Ratna Kumari |

దిశ ఊట్కూర్ : తమతో కలిసి చదువుకున్న డిగ్రీ స్నేహితుడి కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన రామకృష్ణ కొద్ది రోజుల క్రితం మరణించారు.

స్నేహితుడి కుటుంబానికి చేయూత
X

దిశ ఊట్కూర్ : తమతో కలిసి చదువుకున్న డిగ్రీ స్నేహితుడి కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన రామకృష్ణ కొద్ది రోజుల క్రితం మరణించారు. తమతో చదువుకున్న మిత్రుడు కుటుంబానికి సహాయం చేయాలని 2005 - 06 డిగ్రీ మిత్ర బృందం నిర్ణయించుకుని... రామకృష్ణ భార్య లక్ష్మి కు రూ.30వేలు ఆర్థిక సహాయంతో పాటు బియ్యం, వస్త్రాలు అందించారు. కష్టకాలంలో స్నేహితుని కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు వారీ కుటుంబానికి ఆసరాగా నిలవడం పట్ల డిగ్రీ మిత్ర బృందాన్ని గ్రామస్తులు అభినందించారు.

Next Story