- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI ATM : ఎస్బీఐ ఏటీఎంలో దొంగల ముఠా చోరీకి విఫలయత్నం..
గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండీడ్ మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలోని డబ్బులను చోరీకి దొంగల ముఠా ప్రయత్నించింది.

దిశ, మహమ్మదాబాద్ /గండీడ్ : గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండీడ్ మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలోని డబ్బులను చోరీకి దొంగల ముఠా ప్రయత్నించింది. దాదాపు శనివారం తెల్లవారుజామున అందాజా మూడున్నర గంటల ప్రాంతంలో గండీడ్ లోని ఎస్బీఐ బ్రాంచ్ కు సంబంధించిన ఏటీఎంలో కొందరు గుర్తుతెలియని దొంగలు మొహాలకి గుడ్డలు కట్టుకొని ఏటీఎంలోని డబ్బును చోరీ చేయడానికి ప్రయత్నించినారు.
ఈ సమాచారం తెలుసుకొని వెంటనే పోలీసు వారు అక్కడికి వెళ్లి లోపల చోరీకేత్నించిన దుండగులు ఇట్టి విషయం తెలుసుకుని అక్కడి నుంచి పారిపోయినారు. ఈ విషయంలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ దరఖాస్తు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేయనైనది. ఇటు నేర స్థలమునకు మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు, మహబూబ్ నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, క్లూస్ టీమ్ కు సంబంధించి రాజేందర్ ఇన్స్పెక్టర్, మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి పోలీస్ సిబ్బంది చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు.






