- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకరమైన మలుపు ప్రమాదాలకు ముప్పు
వనపర్తి జిల్లా గోపాలపేట మండల పరిధిలోని ఏదుట్ల గ్రామం సమీపంలో గల ప్రమాదకరమైన మూలమలుపు ఉండడంతో నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణికులకు సూచిక బోర్డు లేక అతివేగంతో ప్రయాణించడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాలపేట మండల పరిధిలోని ఏదుట్ల గ్రామం సమీపంలో గల ప్రమాదకరమైన మూలమలుపు ఉండడంతో నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణికులకు సూచిక బోర్డు లేక అతివేగంతో ప్రయాణించడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గోపాల్ పేట మండల పరిధిలోని ఎదుట్ల గ్రామం నుంచి గోపాల్ పేటకు వెళుతుండగా ఈ ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. అధికారులు, రహదారులు వేశారు. కానీ దానికి తగిన సూచిక బోర్డులు పెట్టకపోవడంతో ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. అలాగే ఈ అత్యంత భయంకరమైన ప్రమాదం పక్కనే 11 స్తంభాలతో కూడిన విద్యుత్తు లైను చెట్లపొదల్లో దాగి ఉంది. ఈ ప్రమాదకరమైన ట్రాన్స్ ఫార్మర్ ఇక్కడి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. కాబట్టి వెంటనే విద్యుత్ అధికారులు, రవాణా శాఖ అధికారులు వీటిపై తగు చర్యలు తీసుకోవాలని మండలాల్లోని ప్రజలు కోరుచున్నారు. గతంలో కూడా ఇక్కడ పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.






