- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు పశువుల కాపరి.. నేడు ప్రభుత్వ ఉద్యోగి
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదంటారు మన పెద్దలు ఈ వాక్యం నిజం చేశాడు గ్రామీణ యువకుడు.

దిశ, తిమ్మాజీపేట : పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదంటారు మన పెద్దలు ఈ వాక్యం నిజం చేశాడు గ్రామీణ యువకుడు. తిమ్మాజీపేట మండల పరిధిలోని గోరిట గ్రామానికి చెందిన రవి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన పట్టుదలతో ఇంటి దగ్గరే చదివి నేడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. 1994 వ సంవత్సరంలో 5 వ తరగతి పూర్తి చేసుకున్న ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువుకు దూరమయ్యాడు. రవికి చదువుపై ఆసక్తి ఉన్న తన తండ్రి మాటను దిక్కరించకుండా చదువు మానేసి పొలం పని చేయడానికి ఒప్పుకున్నాడు 5 సంవత్సరాలు అలుపెరగకుండా వ్యవసాయ పనిలో నిమగ్నమై రవికి తన చదువుకు దూరం కావడం ఇష్టం లేక మళ్ళీ చదువును కొనసాగించుకున్నాడు. కానీ మళ్ళీ స్కూల్ కు వెళ్ళి చదువుకొనే పరిస్థితి లేదు తాను స్కూల్ కి వెళ్ళితే వ్యవసాయ పనులు ఆగిపోవడం మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు కుటుంబ జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఇలాంటి పరిస్థితి తన గురువు ధనుంజయ రెడ్డి వారి సలహాతో పగలంతా వ్యవసాయ పని చేసుకుంటూ రాత్రి పూట తన గురువు ఇంట్లోనే 10 వ తరగతి పుస్తకాలు చదువుకుంటూ 2000 సం లో ప్రైవేట్ గా 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు, అంతటితోనే ఆగకుండా INDIAN ARMY లో చేయాలనుకున్నాడు, పలు మార్లు ప్రయత్నించి 2005 సం లో భారత సైన్యం లో ఉద్యోగం సాధించాడు.
తన సర్వీస్ లో ఎక్కువ కాలం LOC, LAC, వంటి బోర్డర్స్ లో విధులు నిర్వహించాడు, చదువు పై తనకున్న ఆసక్తిని నిర్లక్ష్యం చేయకుండా తీరిక సమయంలో చదువుకుంటూ 2015 లో OU PGRR CSE కాలేజీ నుండి BA పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా పొందాడు, భారత సైన్యంలో 17 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని 2022 మార్చిలో హవల్దార్ గా రిటైర్ అయ్యారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చేయాలని అందించేందుకు సబ్ ఇన్స్పెక్టర్ లేదా TGPSC నిర్వహించే గ్రూప్ 2, గ్రూప్ 3, వంటి ఉన్నత ఉద్యోగం సాధించాలనే కోరికతో 2023 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యగం వచ్చిన వెళ్లకుండా 2024 డిసెంబర్ లో TGPSC నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో స్వల్ప మార్కుల తేడా తో ర్యాంక్ లో సాధించలేకపోయినా 2024 నవంబర్ లో జరిగిన గ్రూప్3 పరీక్షలో స్టేట్ 6వ ర్యాంక్ సాధించి నేడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లో (HOD)PAO విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా ఎంపిక అయ్యారు. కష్టపడి చదువుకున్న యువకుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నాడు. ఈ విషయాన్ని మండల, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.






