- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ప్రమాదంలో ఎద్దు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం ఈడిగోనిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ లింగన్నకు చెందిన ఎద్దు విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందింది.

దిశ, జోగులాంబ ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం ఈడిగోనిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ లింగన్నకు చెందిన ఎద్దు విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో పొలం సమీపంలో తిరుగుతున్న ఎద్దు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఉదయం గమనించిన రైతు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతి చెందిన ఎద్దు వ్యవసాయ పనులకు ఉపయోగపడేదని దీని విలువ సుమారు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు లింగన్న తెలిపారు. ఒక్కసారిగా ఎద్దు మృతి చెందడంతో తాము తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






