డీఎస్పీగా ఎంపికైన ఎస్సై సుజాతకు ఘ‌న‌ సన్మానం

by Ratna Kumari |   (  Updated:2025-09-30 11:24:06  IST  )

దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్సై కొమారి సుజాత ను మంగళవారం వారి స్వగృహంలో వాల్మీకి బోయ ఐక్య

డీఎస్పీగా ఎంపికైన ఎస్సై సుజాతకు ఘ‌న‌ సన్మానం
X

దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్సై కొమారి సుజాత ను మంగళవారం వారి స్వగృహంలో వాల్మీకి బోయ ఐక్య కార్యచరణ కమిటీ చైర్మన్ ఉమ్మల్ల రాములు ఆధ్వర్యంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. దీంతో నిరుపేద కుటుంబం నుంచి డీఎస్పీగా ఎంపికైన ఎస్సై సుజాతను ఆమెను ప్రోత్సహించిన తల్లి కళావతమ్మను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఐక్య వాల్మీకి బోయ ఐక్య కార్యచరణ కమిటీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, మాజీ సర్పంచులు వెంకటయ్య నాయుడు, దేవేంద్రం నాయుడు, నాయకులు శేషయ్య నాయుడు, శివలింగం, రాఘవేందర్, సంపత్ పాల్గొన్నారు.

Next Story