- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగర్ కర్నూలు జిల్లాలో గంజాయి కలకలం.. 750 గ్రాములు స్వాధీనం
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం రేపింది. ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు ఆదివారం మీడియాకు

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం రేపింది. ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ డీఎస్పీ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం పది గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు హౌసింగ్ బోర్డు లోని చైతన్యలాడ్జిలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్సై కానిస్టేబుళ్లతో నిఘా పెట్టి హరిజనవాడ కాలనీకి చెందిన రేణు కుమార్ , ఈశ్వర్ కాలనీకి చెందిన సందీప్, రాఘవేంద్ర కాలనీకి చెందిన విశ్వాస్, అచ్చంపేటకు చెందిన వంశీని, చైతన్య లాడ్జ్ 106 రూమ్ లో అదుపులోకి తీసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని విచారించగా...హైదరాబాదులోని దూల్ పేట ఏరియాలో ఆకాశ్ సింగ్ దగ్గర కేజీ గంజాయిని కొనుగోలు చేసి నాగర్ కర్నూల్ తీసుకొచ్చారు. ఆ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా వేరు చేసి చైతన్య లాడ్జిలో 106 రూమ్ ని అద్దెకి తీసుకున్నారు. ఆ రూమ్ లోనే గంజాయి సేవిస్తూ అధిక రేట్లకు అమ్ముతున్నారు. దీంతో పోలీసులు గంజాయి అమ్మకాలపై సమాచారం రావడంతో లాడ్జీ పై రైడ్ చేయగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కొత్త వెంకటేష్, కొత్త మనోజ్, తాడూరు మండలం గుంత కోడూరు గ్రామానికి చెందిన కృష్ణా గౌడ్, పరమేష్ కు నలుగురు యువకులు విక్రయిస్తున్నగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 735 గ్రాముల గంజాయి, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించనున్నట్టు పేర్కొన్నారు. యువకులు ఎవరు గంజాయికి అలవాటు పడవద్దని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై దృష్టి పెట్టి చెడు అలవాటులకు వెళ్లకుండా చూడాలని డీఎస్పీ కొరారు. నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






