రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 75 శాతం కాంగ్రెస్ వ‌శం : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్రంలో 75 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 75 శాతం కాంగ్రెస్ వ‌శం : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
X

దిశ, కొల్లాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో 75 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ జూప‌ల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప‌ట్ట‌ణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీలో క్లిన్ స్వీప్ చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో గత పాలకుల అవినీతికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని ఆయన పేర్కొన్నారు.19 వార్డుల‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటును సద్వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Next Story