70 గడ్డిమోపులు దగ్ధం

by Ratna Kumari |

ఎండ తీవ్రతతో పాటు విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో మంటలు చెలరేగి గడ్డి మోపులు దగ్ధం అయినా సంఘటన మండలంలోని రామచంద్ర గూడెంలో చోటు చేసుకుంది.

70 గడ్డిమోపులు దగ్ధం
X

దిశ, లింగాలఘణపురం : ఎండ తీవ్రతతో పాటు విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో మంటలు చెలరేగి గడ్డి మోపులు దగ్ధం అయినా సంఘటన మండలంలోని రామచంద్ర గూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మద్ది బుచ్చిరెడ్డి వరి కోసి గడ్డి కట్టలు కట్టిపెట్టగా.. లూజుగా ఉన్న విద్యుత్ వైర్లు రాపిడి వల్ల మంటలు రావడంతో పొలంలో ఉన్న సుమారు 70 గడ్డి కట్టలు తగలబడిపోయినట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ సాయి రెడ్డి మల్లారెడ్డి ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో, గ్రామపంచాయతీ ట్యాంకర్ తో నీటిని తీసుకువచ్చి మంటలను అర్పించారు. సకాలంలో మంటలు ఆర్పడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, చుట్టుపక్కల బావుల వద్ద గడ్డివాములతో పాటు మూగజీవులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు లూస్ గా ఉన్న విద్యుత్ వైర్లను సరి చేయాలని కోరారు.

Next Story