- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణికి 69 ఫిర్యాదులు
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచరాదని, మండల స్థాయిలోనే సంబంధిత అధికారులు ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచరాదని, మండల స్థాయిలోనే సంబంధిత అధికారులు ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ఐడీఓసీ సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధు మోహన్, నర్సింగరావుతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఎండార్స్మెంట్ అంశాలపై ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్నారని, సంబంధిత రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ప్రజలు కలెక్టరేట్ వద్దకు రావాల్సిన అవసరం ఉండదన్నారు.
ఈ వారం ప్రజావాణి కి మొత్తం 69 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ సెన్సస్ ను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, సంబంధిత చార్జి అధికారులు బ్లాక్ లవారీగా పర్యవేక్షణ చేయాలన్నారు. పీఎండీడీకేవై అమలుకు నిబద్ధతతో పని చేయాలని, మే12న సంబంధిత ఉన్నతాధికారులు పథకం అమలుపై చర్చించడానికి, క్షేత్రస్థాయిలో పర్యటించడానికి గద్వాలకు వస్తున్నందున లైన్ డిపార్ట్మెంట్ అధికారులు అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.






