గోపాల్ పేటలో 40 ఎకరాలలో వ్యవసాయ యూనివర్సిటీ స్థల పరిశీలన

by Ratna Kumari |

దిశ‌, గోపాల్ పేట : మండల పరిధిలోని పోలికే పహడు గ్రామ పరిధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి పరిశీలించారు.

గోపాల్ పేటలో 40 ఎకరాలలో వ్యవసాయ యూనివర్సిటీ స్థల పరిశీలన
X

దిశ‌, గోపాల్ పేట : మండల పరిధిలోని పోలికే పహడు గ్రామ పరిధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ గురువారం ఆదర్శ సురభి సందర్శించి పరిశీలించారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన మ్యాప్ ను పరిశీలన చేశారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సంబంధిత ప్రదేశంలో కనెక్టివిటీ, సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన చేపల మార్కెట్ను వినియోగంలోకి తేవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. గోపాల్ పేట‌లో నిర్మించి నిరుపయోగంగా ఉన్న చేపల మార్కెట్ ని కలెక్టర్ పరిశీలించారు. దీని వినియోగంలోకి తీసుకురావడానికి వెంటనే బోర్ ద్వారా నీటి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం తరఫున సభ్యులు కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ సుధీర్ రెడ్డి DCO ప్రమోద, జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, తాహశీల్దార్ తిలక్ రెడ్డి,ఎంపీడీవో అయిషా, ఆర్ ఐ ప్రసన్న, ల్యాండ్ సర్వేర్ రాము ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బాలరాజు, సోదరులు పాల్గొన్నారు.

Next Story