- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోపాల్ పేటలో 4 ఆర్ఎంపీ కేంద్రాలు సీజ్
దిశ, గోపాల్ పేట : మండల కేంద్రంలో ఓ పసిరీకల దవఖానా, మూడు ఆర్ఎంపీలకు సంబంధించిన ఆసుపత్రులను డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం తనిఖీలను చేపట్టి

దిశ, గోపాల్ పేట : మండల కేంద్రంలో ఓ పసిరీకల దవఖానా, మూడు ఆర్ఎంపీలకు సంబంధించిన ఆసుపత్రులను డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం తనిఖీలను చేపట్టి సీజ్ చేశారు. అయితే ఆర్ఎంపీ డాక్టర్లు సూదులు, గ్లూకోజ్ బాటిల్స్ వేయకూడదని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు తెలిపారు. గోపాల్ పేట నుంచి వనపర్తి రోడ్డులో గాజుల కోనేరు శివాలయం ముందు ఆర్ఎంపీ డాక్టర్లు ఎవ్వరో తెలియదు. కానీ బీటీ రోడ్డు పక్కన సిరంజీలు, సూది, మందులు, గ్లూకోజ్ బాటిల్స్ పారేయడంతో ప్రమాదవశాత్తు ఇవి ఎవరికైనా అపాయాన్ని కలిగిస్తాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయం పై డీఎంహెచ్ఓ శ్రీనివాసులు ని దిశా వివరణ కోరగా.. గోపాల్ పేట వాసులు కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ మాకు ఆర్డర్స్ చేశాడు. దీంతో తాము గోపాల్ పేటలో 4 ఆర్ఎంపీ దవఖానాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్లు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. వాళ్లు సూదులు, గ్లూకోజ్ బాటిల్ కానీ పెట్టకూడదని.. ఇలా పెడుతున్నారని తమ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ల పై చర్యలు తీసుకొని.. దావఖానాలు సీజ్ చేసినట్టు వెల్లడించారు. ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీ డాక్టర్లు చెలగాటమాడటం మంచిది కాదని డీఎంహెచ్ఓ వెల్లడించారు.






