3.70 కోట్ల‌తో ట్యాంక్ ప‌నుల ప్రారంభోత్స‌వానికి మంత్రులు రాక

by Ratna Kumari |   (  Updated:2025-10-15 15:54:19  IST  )

దిశ‌, మ‌క్త‌ల్ : పట్టణంలోని పెద్ద చెరువు వద్ద మూడు కోట్ల 70 లక్షలతో ట్యాంక్ బండ్ సుందరీకరణ, అభివృద్ధి పనులను గురువారం ఉమ్మడి జిల్లా ఇన్ చార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ

3.70 కోట్ల‌తో ట్యాంక్ ప‌నుల ప్రారంభోత్స‌వానికి మంత్రులు రాక
X

దిశ‌, మ‌క్త‌ల్ : పట్టణంలోని పెద్ద చెరువు వద్ద మూడు కోట్ల 70 లక్షలతో ట్యాంక్ బండ్ సుందరీకరణ, అభివృద్ధి పనులను శుక్ర‌వారం ఉమ్మడి జిల్లా ఇన్ చార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు. రాష్ట్ర పాడి పశుసంవర్ధక, క్రీడా యువజన, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో అభివృద్ధి పనులను దామోద‌ర రాజ‌న‌ర‌సింహ ప్రారంభించ‌నున్నారు. దీంతో పట్టణ అధ్యక్షుడు రవికుమార్, అధికారులు బుధవారం సాయంత్రం ప‌ర్య‌వేక్షించారు. ట్యాంక్ బండ్ సుందరీకణ పనుల కోసం మూడు నెలల కిందట నిధులు మంజూర‌య్యాయి. కానీ ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో ప‌నుల‌ను ప్రారంభించ‌లేదు. కోర్టు స్టే ఇవ్వ‌డంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. దీంతో రేపు మంత్రి దామోద‌ర అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. మక్తల్ పట్టణ జాతీయ రహదారి 167 రహదారి పక్కనే ట్యాంక్ బండ్ ఉన్నందున మినీ ట్యాంక్ బండ్ ను అభివృద్ధిపరిచి పర్యాటకపరంగా అత్యున్నత స్థాయిలో నిలిపే విధంగా శ్రీకారం చుట్టారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున హాజ‌రై విజ‌యవంతం చేయాల‌ని కోరారు.

Next Story