- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రిస్టియన్ భవన నిర్మాణానికి రూ, 25 లక్షలు మంజూరు చేస్తా : మంత్రి జూపల్లి
దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ లో క్రిస్టియన్ భవన నిర్మాణం కొరకు తనకున్న సాంస్కృతిక శాఖ నుంచి రూ, 25 లక్షలను మంజూరు చేస్తానని

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ లో క్రిస్టియన్ భవన నిర్మాణం కొరకు తనకున్న సాంస్కృతిక శాఖ నుంచి రూ, 25 లక్షలను మంజూరు చేస్తానని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్రిస్టియన్లకు హామీ ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం కొల్లాపూర్ లో ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన క్రిస్టియన్ ప్రేమ విందు కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొల్లాపూర్ లో క్రిస్టియన్ భవన నిర్మాణం కొరకు సాంస్కృతిక శాఖ మంత్రిగా తన శాఖ నిధుల నుంచి రూ.25 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తూ క్రిస్టియన్లకు భరోసా ఇచ్చారు. ఏసుక్రీస్తు అందరి జీవితాలను శాంతి సంతోషాలను కలుగజేయాలని సమావేశంలో పాల్గొన్న క్రిస్టియన్ సోదరీ, సోదరీమణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, తహశీల్దార్ భరత్ కుమార్, పీజీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్, పలువురు ఫాస్టర్లు పాల్గొన్నారు.






